Wed Dec 25 2024 20:12:37 GMT+0000 (Coordinated Universal Time)
పెట్టుబడుదారులు ముందుకొస్తున్నారు : మంత్రి నారా లోకేశ్
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం వెతుకుతున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం వెతుకుతున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారికి ఆహ్వానం పలుకుతున్నామని లోకేష్ పిలుపు నిచ్చారు. ప్రతిభావంతుల నుంచి సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో గతంలో చంద్రబాబు నాయుడు తెచ్చిన ఐటీ విప్లవం ఆంధ్రప్రదేశ్ లోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
పెట్టబడుదారులు...
ఇప్పుడిప్పుడే మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని నారా లోకేష్ తెలిపారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపు కసం ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. ఎన్డీ కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్‌ని కోరుతున్నామని చెప్పారు.
Next Story