Mon Jan 06 2025 11:48:24 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : పులి వెందుల ఎమ్మెల్యే జనంలో తిరగొచ్చు.. జగన్ పై లోకేష్ వెటకారం
మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సెటైర్ వేశారు
మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సెటైర్ వేశారు. పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. జగన్ పరదాలు లేకుండా తిరుగుతామంటే తమకు అభ్యంతరం ఏముంటుందని లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రహదారులన్నీ బాగుపడ్డాయని, ఆ రహదారులపై జగన్ తిరిగితే మంచిదేనని లోకేష్ మీడియాప్రతినిధులతో అన్నారు.
సంక్షేమ పథకాలను...
సంక్షేమ పథకాలను వరసగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. హామీలు ఇవ్వని వాటిని కూడా అమలుచేస్తున్నామని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హామీలలో చెప్పలేదన్నవిషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. ఇప్పటికే పించను మొత్తాన్ని పెంచామని, ఉచిత గ్యాస్ సిలిండర్ ను అమలు చేస్తున్నామని, మెగా డీఎస్పీ నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని ఇలా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, తొందరపడితే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story