Sun May 05 2024 00:27:41 GMT+0000 (Coordinated Universal Time)
మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని
సినీనటుడు మోహన్ బాబును కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి పేర్ని నాని కలిశారు
సినీనటుడు మోహన్ బాబును కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి పేర్ని నాని కలిశారు. ఆయనతో టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వచ్చిన మంత్రి పేర్ని నాని పనిలో పనిగా మోహన్ బాబును కలిసినట్లు చెబుతన్నారు. టాలీవుడ్ కు పెద్దదిక్కుగా ఉన్న మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిన్నటి సమావేశానికి....
నిన్న టాలీవుడ్ పెద్దలతో జగన్ జరిపిన సమావేశానికి మోహన్ బాబు కు ఆహ్వానం అందలేదు. మంచు కుటుంబాన్ని దూరంగా పెట్టారన్న వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న మోహన్ బాబును కలవాలని జగన్ ఆదేశం మేరకే మంత్రి పేర్ని నాని మోహన్ బాబును కలిసినట్లు తెలిసింది.
Next Story