Mon Dec 23 2024 11:08:48 GMT+0000 (Coordinated Universal Time)
పది రోజుల సీఎంకు ఐదో ర్యాంకా?
సర్వేలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సర్వేలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో నటి రవళితో కలసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేయించేవన్నీ బోగస్ సర్వేలని అన్నారు. అందుకే ఆయనను బోగస్ బాబుగా పిలుస్తారని రోజా ఎద్దేవా చేశారు. పదిరోజులు ముందు సీఎం అయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఐదో ర్యాంకు, మూడేళ్లుగా పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తునన జగన్ కు అట్టడుగు ర్యాంకు ఇవ్వడంతోనే సర్వే సంస్థ లక్ష్యమేంటో తెలిసిపోయిందని రోజా అన్నారు.
ఎన్ని ఫీట్లు చేసినా....
చంద్రబాబు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేస్తాడని రోజా అన్నారు. సర్వేల పేరుతో తన గ్రాఫ్ పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కు చిన్నమెదడు చిట్లిపోయిందని అన్నారు. త్వరలోనే చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
Next Story