Mon Dec 23 2024 04:11:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్‌కు రోజా వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలకొడతామన్నారు
జనసేన అధినేతకు పవన్ కల్యాణ్‌కు ఏపీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలకొడతామని హెచ్చరించారు. పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొట్టి బుద్ధి చెబుతామన్న రోజా పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని తెలిపారు. జైల్లోకి వెళ్లి పొత్తుపెట్టుకుని పిచ్చి కల్యాణ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ ను నీ స్థాయెంత? అని అడుగుతావా? అని నిలదీశారు. జగన్ ఎంపీగా గెలిచి, ఇప్పుుడు ముఖ్యమంత్రి అయి తన ఒంటి చేత్తో 151 స్థానాలను గెలిపించుకున్న జగన్ ఎక్కడ? నువ్వెక్కడ? అని నిలదీశారు.
పళ్లు రాలకొడతాం...
మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ఒక పెద్ద దొంగ అని రోజా అన్నారు. దొంగ చెప్పే మాటలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సుమన్ మజీ ఎండీ ఎందుకయ్యారో అందరికీ తెలుసునన్న ఆమె సీమన్స్ సంస్థ కోర్టులోనే ఈ వ్యక్తి తమకు తెలియకుండానే నిధులు కాజేశారని చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయెంత? అంటూ ఎదురుదాడికి దిగారు. బానిస బతుకు బతుకుతున్న నీతో జగన్ కు పోటీయా? అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
Next Story