Mon Dec 23 2024 01:22:21 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : శరద్ పవార్ ను కలిసిన వైఎస్ షర్మిల
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. కొద్ది సేపటి క్రితం ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రశ్నించాలని కోరారు. ీ మేరకు ఆమె శరద్ పవార్ కు వినతి పత్రాన్ని అందించారు.
ప్రత్యేక హోదా కోసం...
ప్రస్తుత ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని తెలిపారు. షర్మిలతో పాటు మాజీ పీసీసీ చీఫ్ లు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, షేక్ మస్తాన్ వలి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు. ఈరోజు ఏపీ భవన్ లో వైఎస్ షర్మిల దీక్షకు దిగనున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె దీక్ష చేపట్టనున్నారు.
Next Story