Sat Dec 28 2024 23:04:45 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి ముందు... తర్వాత కూడా?
ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు సంస్థ సంక్రాంతికి స్పెషల్ సర్వీసులను నడపనుంది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు సంస్థ సంక్రాంతికి స్పెషల్ సర్వీసులను నడపనుంది. గతంలో కంటే 35 శాతం అధికంగా సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి పండగకు ముందు, ఆ తర్వాత స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ నడపనుంది. సంక్రాంతి పండగకు ఏపీకి వచ్చే వారి కోసం, అలా పండగ నుంచి తిరిగి వెళ్లే వారి కోసం స్పెషల్ సర్వీసులను నడిపేందుకు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.
స్పెషల్ సర్వీసులు....
సంక్రాంతి పండగ కోసం వివిధ ప్రాంతాల నుంచి 6,970 సర్వీసులను నడపనుంది. సంక్రాంతి పండగకు ముందు 4,145 సర్వీసులు, పండగ తర్వాత 2,825 సర్వీసులను తిప్పనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఈ సర్వీసులను నడుస్తాయి. ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది.
Next Story