Sun Dec 29 2024 17:09:47 GMT+0000 (Coordinated Universal Time)
పండగకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పండగలకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రధానంగా ఏపీ వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
పండగలకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల క్సిస్మస్, వచ్చే నెల సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉండనున్నాయి. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లేవారికి రిజర్వేషన్ కల్పించింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ వీలును ఏపీఎస్ ఆర్టీసీ ఎప్పుడో కల్పించింది.
వాటికీ రిజర్వేషన్....
అయితే పండగలు దగ్గరపడతుతుండటంతో దాదాపు అన్ని బస్సులు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో డిమాండ్ ను బట్టి బస్సుల సంఖ్యను పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక బస్సులకు కూడా ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
Next Story