Sun Dec 22 2024 23:08:14 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. జనవరి ఆరో తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అయితే సంక్రాంతికి వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలనే అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాయితీలు కూడా...
వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్న వారికి పది శాతం రాయితీని ఇస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ముందుగా రిజర్వేషన్ చేసే సదుపాయం కూడా కల్పించామని తెలిపారు. సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు ఇంటికి వెళ్లే వారికి ఎలాంటి కష్టం లేకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Next Story