చంద్రబాబు నేరకుట్ర పూరితకు పాల్పడ్డారు: సీఐడీ
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. సీఐడీ చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. నిన్న..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. సీఐడీ చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. నిన్న సిట్‌ముందు ప్రవేశపెట్టిన పోలీసులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురించారు. దాదాపు20 అంశాలపై ప్రశ్నించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సీఐడీ కోర్టులో హాజరు పర్చారు. కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను సీబీఐ అధికారులు కోర్టుకు అందించారు.సీఐడీ ఛీఫ్ సంజయ్ చెప్పిన అంశాలనే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న దర్యాప్తు అధికారి. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగంపై అభియోగాలు, ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ వెల్లడించింది.
డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేశారు. అలాగే రూ.279 కోట్ల నిధుల దుర్వినియోగమైనట్లు సీఐడీ నివేదికలో పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. రిమాండ్ రిపోర్టు ను 28 పేజీల్లో సబ్మిట్ చేశారు సీఐడీ అధికారులు. అయితే చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని కోర్టులో ఏపీ సీఐడీ తెలిపింది.
కాగా, చంద్ర బాబు నాయుడు తరపున వాదనలు వినిపించడానికి ముగ్గురిని కోరగా, ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచారు జస్టిస్ హిమ బిందు. సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అనుమతి ఇచ్చారు. అయితే ఇంత మంది లాయర్లు ఇక్కడ ఎందుకున్నారని జస్టిస్ ప్రశ్నించారు. స్వచ్ఛందంగా మీరే వెళ్ళండి ..15 మంది కి మాత్రమే అవకాశం, 409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయని అన్నారు.
అసలు ఈ సెక్షన్ ఈ కేసు లో పెట్టడం సబబు కాదని లాయర్ లోద్ర వాదనలు వినిపించారు. 409 పెట్టాలి అంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని, రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని లొద్రా పేర్కొన్నారు. దీంతో తిరస్కరణ పై వాదనలు కు అవకాశం కల్పించారు జస్టిస్. అయితే రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ చేయాలి లోద్ర ముందు వాదనలు వినిపించారు. తనవాదనలు కూడా వినాలని చంద్రబాబు కోరగా, కోర్టులో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.అయితే కోర్టులో మరో రెండు గంటల పాటు వాదనలు జరిగే అవకాశం ఉంది.