Tue Jan 07 2025 10:48:26 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలోనే ఏపీ ఫస్ట్.. ప్రకటించిన కేంద్రం
ఉపాధి హామీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది
ఉపాధి హామీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రెండో స్థానంలో నిలబడింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది.
తర్వాత తెలంగాణ...
మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని ఆ శాఖ వెల్లడించింది. ఇక తర్వాతి మూడు స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది.
Next Story