Mon Jan 13 2025 06:11:12 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టుకు తేల్చి చెప్పిన జగన్ సర్కార్
మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును వెనక్కు తీసుకున్న విషయాన్ని అఫడవిట్ రూపంలో ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. పాత బిల్లుల స్థానంలో మార్పులు తెచ్చి కొత్త బిల్లులను త్వరలోనే తెస్తామని హైకోర్టుకు ఇచ్చిన అఫడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
మళ్లీ ప్రవేశపెడతామని....
శానససభలో ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను హైకోర్టుకు సమర్పించిన సందర్భంలో తాము త్వరలో కొత్త బిల్లులను ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం పేర్కొనడటం విశేషం. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆకాంక్షల మేరకే తాము ముందుకు వెళతామని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై అమరావతి రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story