Sun Dec 22 2024 22:01:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆహా ఏమి కిక్కు.. ఖజానాకు ఎంతంటే?
సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మద్యం రూపంలో పెద్దయెత్తున ఆదాయం లభించింది
సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మద్యం రూపంలో పెద్దయెత్తున ఆదాయం లభించింది. పండగ సందర్భంగా మద్యం ప్రియులు తాగి ఊగారు. ఒకవైపు కోడిపందేలు..మరో వైపు మద్యంతో విందులతో ఏపీకి మంచి కిక్కు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండగ ఏపీ సర్కార్ కు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
మూడు రోజుల్లో...
మూడు రోజుల్లో 213 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కోడిపందేలు ఎక్కువగా జరిగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 21 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీలో మొత్తం2.33 లక్షల కేసుల మద్యం, 83 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయని అధికారులు తెలిపారు.
Next Story