Tue Dec 17 2024 06:41:08 GMT+0000 (Coordinated Universal Time)
AP Aqua Farmers Subsidy:ఆ రైతులకు శుభవార్త చెప్పేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆక్వా రైతులకు సబ్సిడీపై
AP Aqua Farmers:ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేయనుంది. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ తీర్మానం చేశారు. అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు.
అర్హులైన ఆక్వా రైతులందరికి మార్చి 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీని వర్తింపజేయాలని డిస్కమ్ లను ఆదేశిస్తూ తీర్మానం చేయడంతో ఎంతో మంది రైతులకు మేలు కలగనుంది. ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు సబ్సిడీపై విద్యుత్ అందించనున్నారు. ఆక్వా రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటించడం వల్ల ఆక్వా రైతులకు లాభం చేకూరిందని మంత్రులు తెలిపారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోందన్నారు.
రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా.. తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగింది. ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించింది ప్రభుత్వం.
Next Story