Mon Dec 23 2024 07:33:04 GMT+0000 (Coordinated Universal Time)
మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ శాఖలోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ శాఖలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, వారికి మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Next Story