Thu Dec 19 2024 19:11:11 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో అన్నా క్యాంటిన్ ధ్వంసం.. లోకేష్ పర్యటనతో టెన్షన్
కుప్పంలో అన్నా క్యాంటిన్ ను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు
కుప్పంలో అన్నా క్యాంటిన్ ను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రి పదకొండు గంటల సమయంలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లాలో ఉంది. ఆయన పర్యటనకు వస్తున్న సందర్భంలో అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేయడంతో కుప్పంలో మరోసారి టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బాబు ప్రారంభించిన...
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనలో దీనిని ప్రారంభించారు. ఇక్కడ కూడా అప్పుడు ఘర్షణ జరిగింది. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయంచి నిరసన తెలియజేశారు. అన్నం పెట్టే చేతులను నరికివేస్తారా? అని చంద్రబాబు మండి పడ్డారు. ఐదు రోజుల క్రితం ప్రారంభించిన ఈ అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుప్పంలో మరోసారి టెన్షన్ మొదలయింది.
Next Story