Mon Dec 23 2024 17:22:44 GMT+0000 (Coordinated Universal Time)
అన్నవరం ఆలయంలో అసలు ఏమి జరుగుతోంది
కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాహ్మణులను వేలంపాట ద్వారా తీసుకొచ్చి భక్తులకు సింగిల్ విండో ద్వారా మేలు చెయ్యాలని
కాకినాడ జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామసత్యనారాయ స్వామి దర్శనానికి ఎన్నో చోట్ల నుండి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలయంలో పురోహితుల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆలయంలో స్థానిక, స్థానికేతర పురోహితుల మధ్య వివాదానికి తెరలేచింది. పురోహితులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని అన్నవరం కొండపై జరిగే వివాహాలకు ఉపనయనాలను జరిపించేందుకు ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం కొండపై దళారుల బెడద తగించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాహ్మణులను వేలంపాట ద్వారా తీసుకొచ్చి భక్తులకు సింగిల్ విండో ద్వారా మేలు చెయ్యాలని అనుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కొండపై అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న బయట దళారులను ఈ విధానం ద్వారా కట్టడి చేయవచ్చని అన్నారు ఆలయ ఈవో ఆజాద్. పెళ్లిళ్లకు ఉపనయనాలకు వసూలు చేసిన మొత్తాన్ని వేలంపాట ద్వారా పురోహితులకి పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. దీనికి ఒక వర్గం పురోహితులుమద్దతు తెలుపుతుంటే.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహితుల సమాఖ్య దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. సింగిల్ విండో విధానం మాకు వద్దని ఇప్పటికే ఆలయ ఈవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో అని భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.
Next Story