Sun Dec 14 2025 18:11:18 GMT+0000 (Coordinated Universal Time)
రేపటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలుజరుగుతున్నాయి. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటితో ఈ ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. మాడ వీధుల్లో భక్తులు స్వామి వారి రధాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
మాడ వీధులన్నీ...
మాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. గోవింద నామస్మరణలో తిరుమల వీధులన్నీ మారు మోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రేపు ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. రాత్రి ఏడు గంటలకు కల్కి అవతారంలో అశ్వవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. రేపు ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Next Story

