Mon Dec 15 2025 00:15:42 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో కూటమికి బీజం
ఆంధ్రప్రదేశ్లో మరో కూటమికి బీజం పడింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో మరో కూటమికి బీజం పడింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు వైఎస్ షర్మిల వామపక్ష నేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్, వామపక్ష నేతల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
రానున్న ఎన్నికల్లో....
రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలసి పోటీ చేయడంతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. సీపీఐ నుంచి వెంకటేశ్వరరావు, ఎంఎ గఫూర్, శ్రీనివాసరావు హాజరయ్యారు. సీపీఐ నుంచి రామకృష్ణ, నాగేశ్వరరావు, వనజ, జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి షర్మిలతో పాటు మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజులు పాల్గొన్నారు.
Next Story

