Thu Dec 19 2024 09:00:41 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లి పై మరో కేసు.. హత్యాయత్నం కేసు నమోదు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయింది
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయింది. ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై కూడా హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడి సీఐను కొట్టిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయబోయిన పిన్నెల్లి బ్రదర్స్, వారి అనుచరులను అడ్డుకున్న సీఐపై దాడి చేశారని కేసులో పేర్కొన్నారు. వైసీపీ నేతల రాళ్ల దాడిలో న సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారు. తొలుత 10 మంది ఆగంతకులు దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు.
సీఐపై దాడి ఘటనలో...
అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును అధ్యయనం చేస్తున్న దశలో సీఐ నారాయణ స్వామి స్టేట్మెంట్ ఆధారంగా ఐపీసీ 307 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ నారాయణస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పాల్వాయి గేట్ గ్రామంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి కేసులో హత్యాయత్నం కేసు నమోదయింది.
Next Story