తిరుమలలో చిక్కిన మరో చిరుత.. ఇంకెన్ని ఉన్నాయో?
తిరుమలలో చిరుతల సంచారం ఎక్కువవుతోంది. కొద్దిరోజుల కిందటే ఒక చిరుతను పట్టుకోగా
తిరుమలలో చిరుతల సంచారం ఎక్కువవుతోంది. కొద్దిరోజుల కిందటే ఒక చిరుతను పట్టుకోగా.. నేడు మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించింది. దీంతో ఆ చిరుతను బంధించేందుకు అధికారులు దాడి జరిగిన పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా మరుసటి రోజే ఓ చిరుత చిక్కింది. ఆ తరువాత కొన్ని రోజులకే మరో చిరుత చిక్కింది. తిరుమలలో సంచరిస్తున్న చిరుత పులులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఏర్పాటు చేయడంతో ఈ తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని.. చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచెను దాటి కూడా అవి దాడి చేయగలవని తెలిపారు. సోమవారం (ఆగస్టు 14న) ఓ చిరుత చిక్కగా.. ఇప్పుడు మరో చిరుత బోనులో పడింది. మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతల్ని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు.