Mon Dec 23 2024 10:44:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పేర్లు చెప్పాలని వత్తిడి.. వివేకా హత్య కేసులో పిటీషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా సీబీఐ అధికారిపై ఫిర్యాదు చేశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా సీబీఐ అధికారిపై ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో పిటీషన్ వేశారు. సీబీఐ అధికారి రామ్ సింగ్ పై ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని పేర్లు చెప్పాలని తనపై వత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి తన పిటీషన్ లో కోర్టుకు ఫిర్యాదు చేశారు.
పులివెందుల కోర్టులో....
తనపై వత్తిడి తెచ్చి కొన్ని పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తన పిటీషణ్ లో కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే కడప ఎస్పీకి, పులివెందుల ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటీషన్ లో కృష్ణారెడ్డి తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వేరే పేర్లు చెప్పాలని వత్తిడి తెస్తున్నారన్నారు. అయితే దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
Next Story