Thu Dec 19 2024 12:41:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసుల్లో జోగి రాజీవ్ ఏ1 నిందితుడిగా ఉన్నారు.
అగ్రిగోల్డ్ కు సంబంధించి....
అయితే అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములను కబ్జా చేశారని రాజీవ్ పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అరెస్ట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్ట్ విషయాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించినట్లు తెలిసింది.
Next Story