ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు
ఏజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్రంలో పెను సంచలన సృష్టించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో..
ఏజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్రంలో పెను సంచలన సృష్టించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సీఐడీ పోలీసులు సిట్ ముందు హాజరు పర్చారు. అక్కడ దాదాసే 20 అంశాలపై చంద్రబాబును ప్రశ్నించగా, ఎలాంటి సమాధానం రాలేదని సిట్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. దీంతో ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన తరఫున రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తరువాతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలాఉంటే ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ముందు ఉద్రిక్తల నెలకొంది. న్యాయవాదులు జడ్జి ఇంటి ముందు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు న్యాయవాదులు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఆందోళనకు దిగారు.