Mon Dec 23 2024 12:49:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పెగాసస్ పై అసెంబ్లీలో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు అసెంబ్లీ ముందుకు పెగాసస్ నివేదిక రానుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు అసెంబ్లీ ముందుకు పెగాసస్ నివేదిక రానుంది. మొత్తం 85 పేజీలతో కూడిన నివేదిక సభ ముందు ప్రవేశపెట్టనుంది. దీనిపై ఈరోజు సభలో చర్చించే అవకాశాలున్నాయి. దీనిపై వాడి వేడి చర్చ జరగనుంది.
బాబు హయాంలో...
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ తో పాటు డేటా చౌర్యం జరిగిందని స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నియమించిన కమిటీ దఫాలుగా విచారణ చేసి నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించిన నివేదికన ఇప్పటికే కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పీకర్ కు అందజేశారు. సభలో దీనిపై ఈరోజు చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story