Mon Dec 23 2024 13:36:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 15నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముంది.
ఈ నెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశంలోనే మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశముంది. ఏపీ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
కీలక బిల్లులను...
ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే అవకాశముందని తెలుస్తోంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజుల పాటు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు. పలు సంక్షేమ పథకాలపై ఈ ఐదు రోజుల పాటు సమావేశాల్లో చర్చించనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వివరించే ప్రయత్నాన్ని అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ వినియోగించుకోనుంది.
Next Story