Mon Dec 23 2024 13:08:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకూ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దాదాపు ఇరవై పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాప వ్యక్తం చేసి అనంతరం వాయిదా పడనుంది.
బడ్జెట్ పై కసరత్తులు....
మార్చి 8వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా తేదీలను దాదాపుగా ఖరారు చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను మార్చి 11 లేదా 14వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్ పై అధికారులు కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది.
Next Story