Fri Dec 20 2024 07:33:32 GMT+0000 (Coordinated Universal Time)
Purandhreswari : బెయిల్ రావడం మంచిదే.. స్వాగతిస్తున్నాం
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ బీజేపీ స్వాగతించింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ బీజేపీ స్వాగతించింది. పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మాట్లాడుతూ తాము మొదటి నుంచి ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పడుతున్నామని చెప్పారు. తమ పార్టీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు.
తమ వాదన తొలి నుంచి...
న్యాయస్థానంలో వచ్చిన తీర్పు మంచిదేనని పురంద్రీశ్వరి తెలిపారు. తొలి నుంచి బీజేపీ చెబుతున్నది అదేనని, ఆయనను అరెస్ట్ చేయడం సక్రమంగా లేదన్నదే తమ వాదనని అని ఆమె అన్నారు. ఇందుకు అనేక మంది తనపైనా, పార్టీపైనా విమర్శలు చేసినా తాము ఒకే మాట మీద కట్టుబడి ఉన్నామని పురంద్రీశ్వరి తెలిపారు.
Next Story