Fri Dec 20 2024 19:43:43 GMT+0000 (Coordinated Universal Time)
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని.. ఇది ప్రభుత్వ బాధ్యత అని ఏపీ కేబినెట్ అభిప్రాయపడింది.
పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం తెలపడమే కాకుండా భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలిపింది. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం లభించింది. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపారు.
Next Story