Wed Dec 25 2024 13:42:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
బడ్జెట్ సమావేశాలపై...
ఈ నెలాఖరులో నిర్వహించాలా? వచ్చే నెలలో బిజినెస్ సమ్మిట్ పూర్తయిన తర్వాత నిర్వహించాలా? అన్న దానిపై ఈ సమావేశం తర్వాత స్పష్టత రానుంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story