Mon Dec 23 2024 15:21:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. రెండో భాషగా ఉర్దూ
రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ అధికార భాషా చట్టం 1966ను..
అమరావతి : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ అధికార భాషా చట్టం 1966ను సవరణ చేయాలని తీర్మానించింది. సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కూడా కేబినెట్ ఆమోదమిచ్చింది. అలాగే నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా.. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్లు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానించింది. మరోవైపు టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందూ ధార్మిక సంస్థల చట్టానికి సవరణ చేయాలని తీర్మానించింది.
Next Story