Wed Dec 25 2024 13:51:04 GMT+0000 (Coordinated Universal Time)
పీఆర్సీపై నేడు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు పే రివిజన్ కమిషన్ పై సమీక్ష చేయనున్నారు. ఉన్నతాధికారులతో ఆయన ఈ అంశంపై చర్చించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు పే రివిజన్ కమిషన్ పై సమీక్ష చేయనున్నారు. ఉన్నతాధికారులతో ఆయన ఈ అంశంపై చర్చించనున్నారు. పీఆర్సీ, ఉద్యోగ సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లను ఈ సమీక్షలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పీఆర్సీని నివేదికను పది రోజుల్లో బయటపెడతామని ముఖ్యమంత్రి జగన్ ఇటీవల తిరుపతిలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగ సంఘాల ఆందోళనతో....
ఉద్యోగ సంఘాలు పీఆర్సీ తో పాటు 71 డిమాండ్లతో ఆందోళనకు ఈ నెల 7వ తేదీ నుంచి దిగిన సంగతి తెలిసిందే. దశల వారీగా కార్యచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story