Mon Dec 23 2024 15:16:23 GMT+0000 (Coordinated Universal Time)
వారికి కొత్త ఏడాదైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నా
వృద్ధులకు నేటి నుంచి పింఛను మొత్తాన్ని పెంచుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
వృద్ధులకు నేటి నుంచి పింఛను మొత్తాన్ని పెంచుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పింఛను మొత్తాన్ని ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల వరకూ పెంచుకుంటూ పోతామని చెప్పారు. 2500 రూపాయలు ఈ నెల పింఛనును అందరూ అందుకుంటారని జగన్ చెప్పారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక ఆధారం లేకుండా ఉండే వారిని ఆదుకోవడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వం....
గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు మాత్రమే పింఛను ఇచ్చేదని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా తమ ప్రభుత్వం పింఛనును అందిస్తుందన్నారు. 62 లక్షల మందికి నేడు పింఛన్లను అందచేస్తున్నామని చెప్పారు. కేవలం క్యాలెండర్ మాత్రమే కాదు పేదల జీవితాలను కూడా మార్చాలన్నారు. మంచి చేస్తుంటే విమర్శించే వారు కూడా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం పింఛన్ల కోసం కేవలం 400 కోట్లు ఖర్చు చేసేదని, తమ ప్రభుత్వం 1570 కోట్లు ఖర్చు చేస్తుందని జగన్ తెలిపారు. పింఛను అందని వారెవరైనా సరే గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు.
కరోనా సమయంలోనూ....
31 నెలల పాలనలో కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితిని చూడకుండా పింఛను మొత్తాన్ని పెంచామన్నారు. ఈ 31 నెలల్లో 41 వేల కోట్లను పింఛను కే ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని జగన్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం నేరుగా వాలంటీర్లు పింఛను మొత్తాన్ని ఇంటికే వచ్చి ఇస్తారన్నారు. ప్రతి నెల మొదటి రోజునే పింఛను ఇస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వానికి, మన పాలనకు తేడా చూడమని జగన్ ప్రజలను కోరారు.
పేదలకు మంచి చేయాలంటే....
పేదలకు మంచి చేయాలని చూస్తే వివిధ వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నారన్నారు. అమరావతిలో పేదలకు భూములు ఇద్దామని భావిస్తే దానిని న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారన్నారు. అలాగే పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి వారి చేతుల్లో లక్షల ఆస్తిని పెడదామంటే దానిని కూడా అడ్డుకున్నారన్నారు. పేదలకు ఇంగ్లీషు చదువులు అందిద్దామన్నా అడుకున్నారన్నారు. చివరకు పేదలకు తక్కువ ధరకు వినోదం అందించాలని సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తే దానిని కూడా అడ్డుకుంటున్నారన్నారు. వీరిందరికి కొత్త సంవత్సరంలోనైనా జ్ఞానం రావాలని కోరుకుంటున్నానని జగన్ తెలిపారు.
Next Story