Tue Dec 24 2024 16:56:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రోడ్డు మార్గాన బయలుదేరాల్సి వచ్చింది.
హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రోడ్డు మార్గాన బయలుదేరాల్సి వచ్చింది. ఈరోజు శింగనమల నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ అక్కడికి వచ్చారు. అయితే తిరిగి వెళ్లే సమయంలో హెలికాప్టర్ ఇంధన సరఫరాలో లోపం గుర్తించిన పైలట్ ప్రయాణానికి విముఖత వ్యక్తం చేయడంతో జగన్ రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.
పుట్టపర్తికి బయలుదేరి...
జగన్ రోడ్డు మార్గాన బయలుదేరి పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు రోడ్డుపైన బారులు తీరారు. జగన్ ను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని సీఎంను చూసేందుకు ముందుకు వచ్చారు. దీంతో పోలీసులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.
Next Story