Sun Dec 22 2024 23:06:03 GMT+0000 (Coordinated Universal Time)
మాజీమంత్రి నారాయణ కూతురి ఇంట్లో సోదాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తుంది. మాదాపూర్లోని నారాయణ కూతురి నివాసంలో సీఐడీ సోదాలు జరుపుతోంది. ఏ విషయంలో ఈ సోదాలను సీఐడీ అధికారులు నిర్వహిస్తున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో...
మాజీ మంత్రి నారాయణ పై ఏపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రాజధాని వంటి కేసులున్నాయి. దీంతో పాటు పదోతరగతి పరీక్ష ప్రశ్నా పత్రాలు లీకేజీ కేసు కూడా నమోదయి ఉంది. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులోనే నారాయణ కూతురి ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story