మార్గదర్శి కేసు.. భారీగా రామోజీ ఆస్తులు అటాచ్
మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. తాజాగా ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు
మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. తాజాగా ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు సంబంధించిన భారీ ఆస్తులను అటాచ్ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్గదర్శిలో చైర్మన్, మేనెజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్లు కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు సీఐడీ పేర్కొంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా సేకరించిన డబ్బులను హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసు ద్వారా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ గుర్తించింది. ఏపీలో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి బిజినెస్ చేస్తోందని, ఏపీలో మార్గదర్శికి సంబంధించిన 1989 చిట్స్ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్‌లు ఉన్నాయని సీఐడీ తెలిపింది. ఏపీలో వసూలు చేసిన చిట్స్‌ను ఇతర ప్రాంతాల్లోని కంపెనీలకు తరలించారని మార్గదర్శిపై అభియోగం ఉంది. ప్రస్తుతం క్లైయింట్స్‌కి డబ్బులు ఇచ్చే స్థితిలో మార్గదర్శి చిట్స్ లేదని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.