Sun Dec 22 2024 22:16:07 GMT+0000 (Coordinated Universal Time)
చింతకాయల విజయ్ కు నోటీసులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41 ఎ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41 ఎ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈనెల సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చింతకాయల విజయ్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లి చింతకాయల పద్మావతికి నోటీసులు సీఐడీ పోలీసులు ఇచ్చి వెళ్లారు.
భారత్ పే అంటూ...
భారత్ పే అంటూ టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ లపై చింతకాయల విజయ్ ను విచారించనున్నారు. ఈ నెల 27 మంగళగిరి సీఐడీ కార్యాలయానికి రావాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతి పేరిట తప్పుడు పోస్టింగ్ లు పెట్టారంటూ ఆయనపై అభియోగాలనున్నాయి. చింతకాయల విజయ్ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ను పర్యవేక్షిస్తుండటంతో ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు.
Next Story