Mon Dec 23 2024 03:13:30 GMT+0000 (Coordinated Universal Time)
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు ఆటంకం కల్గించారంటూ కేసు నమోదు చేశారు
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు ఆటంకం కల్గించారంటూ కేసు నమోదు చేశారు. ఏపీ స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందన్న దానిపై రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లినప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ అధికారులకు విధులకు ఆటంకం కల్గించారని సీఐడీ ఈ కేసు నమోదు చేసింది.
జీరో ఎఫ్ఐఆర్...
లక్ష్మీనారాయణ ఇంట్లో ఎలాంటి వస్తువులు సీజ్ చేయకుండా రాధాకృష్ణ అడ్డుకున్నారని ఏపీ సీఐడీ పోలీసులు చెబుతున్నారు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. అయితే దీనిని రాజకీయ కుట్రగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ సీఐడీ పోలీసులు రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్ కు పంపారు. శుక్రవారం సోదాలు జరిగితే 36 గంటల తర్వాత కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు.
Next Story