Sun Dec 22 2024 22:28:28 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41 ఎ సీఆర్పీసీ కింద నోటీసులను ఇచ్చారు
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41 ఎ సీఆర్పీసీ కింద నోటీసులను ఇచ్చారు. నారాయణతో పాటు ఆయన భార్యకు కూడా సీఐడీ అధకారులు నోటీసులు ఇచ్చారు. అమరావతి భూముల వ్యవహారంలో ఈ నోటీసులు సీఐడీ అధికారులు జారీ చేశారు. ఇటీవల మాజీ మంత్రి నారాయణ కుమార్తెల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
రాజధాని భూముల విషయంలో...
అమరావతి రాజధాని భూముల విషయంలో నారాయణ అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు మార్చి 6వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మార్చి 6న విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. నారాయణతో పాటు భార్య కుమార్తెలతో పాటు అల్లుళ్లు కూడా నోటీసులు జారీ చేశారు. వీరు మార్చి 7,8 తేదీల్లో విచారణకు రావాలని కోరారు.
Next Story