Mon Dec 23 2024 07:22:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుపై మరో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. సీఐడీ పిటీషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. మద్యం అమ్మకాలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. మద్యం విక్రయాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ మరో కేసు నమోదు చేసింది.
ఏసీబీ కోర్టులో....
ఈ కేసులో చంద్రబాబు ఏ3 నిందితుడిగా చేర్చింది. మద్యం తయారీకి సంబంధించి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ నమోదు చేసిన కేసును ఏసీబీ కోర్టు విచారణకు తీసుకుంది. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఇప్పటికే నిందితుడి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
Next Story