మార్గదర్శి కుంభకోణం ఊహించిన దాని కంటే చాలా పెద్దది: ఏపీ సీఐడీ
ప్రజలకు ఎక్కువ వడ్డీ ఇస్తామనే ఆశ చూపి చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోందని ఏపీ సిఐడి ఆరోపించింది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL) కి చెందిన మొత్తం తొమ్మిది శాఖలలో అవకతవకలు జరిగాయని గుర్తించింది. ఉల్లంఘనలను గుర్తించిన శాఖలను మూసివేయనున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మార్చి 10న కేసు దర్యాప్తు చేపట్టామని.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు ఏపీ సీఐడీ అడిషనల్ డిజి సంజయ్ తెలిపారు. ఎంసీఎఫ్పీఎల్కు చెందిన రూ.1,035 కోట్ల విలువైన చరాస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. ఏపీలోనే అతిపెద్ద చిట్‌ఫండ్ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డిజి సంజయ్ తెలిపారు. 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి సంస్థకు ఉందని మార్గదర్శి చిట్‌ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతో సహా పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు.