Tue Dec 24 2024 18:52:59 GMT+0000 (Coordinated Universal Time)
Nara Rammurthi Naidu: విషమంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో వారం క్రితం AIG ఆస్పత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.
రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినీ హీరో నారా రోహిత్, రామ్మూర్తినాయుడు కుమారుడు అనే విషయం అందరికీ తెలిసిందే. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు.
Next Story