Sun Nov 17 2024 03:51:51 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే గవర్నర్ ను కలిశాను: ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందని గవర్నర్ కు చంద్రబాబు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామన్నారు. విజయవాడలో తాము చేపట్టిన సహాయక చర్యల పట్ల గవర్నర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. వరదకు కారణాలు, సహాయ చర్యల గురించి గవర్నర్ కు నివేదించామన్నారు. విజయవాడలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో వర్షపాతం చూసి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Next Story