Sat Dec 28 2024 10:45:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కడప జిల్లాకు జగన్
ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. ఆ తర్వాత రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ ను జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నేడు విశాఖకు...
కడప జిల్లా నుంచి జగన్ సాయంత్రం 4.45 గంటలకు విశాఖకు వెళతారని తెలుస్తోంది. నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖకు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ విశాఖ వెళతారు. అక్కడి నుంచి రాత్రికి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.
Next Story