Mon Dec 23 2024 13:33:02 GMT+0000 (Coordinated Universal Time)
బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్ జిల్లాల పర్యటన ?
2009లో ఒకటి, 2015లో మరొక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. గడిచిన మూడేళ్లుగా సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులనే..
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటన సందర్భంగా కార్లతో కూడిన కాన్వాయ్ నే వినియోగిస్తున్నారు. ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సులను ఆయన తన జిల్లాల పర్యటనల్లో వినియోగించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల పర్యటనలో సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులనే వినియోగిస్తారని, వాటిని సత్వరమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. నిజానికి ఏపీ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులున్నాయి.
2009లో ఒకటి, 2015లో మరొక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. గడిచిన మూడేళ్లుగా సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులనే వాడలేదు. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండటం, జిల్లా పర్యటనలను వేగవంతం చేసే దిశగా.. జగన్ సాగుతున్న నేపథ్యంలో ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లోనే సీఎం తిరగాలంటూ ఆయన భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. సీఎం సూచనలతోనే బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే అందుబాటులో ఉన్న బుల్టెట్ ప్రూఫ్ బస్సులనే జగన్ వినియోగిస్తారా? లేదంటే ఆయన కోసం కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొంటారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
Next Story