Fri Dec 20 2024 22:13:00 GMT+0000 (Coordinated Universal Time)
ప్రొద్డుటూరుపై జగన్ వరాల జల్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రొద్దుటూరు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఐదు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రొద్దుటూరు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దాదాపు ఐదు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఎనిమిది ముఖ్యమైన పనులకు ప్రొద్దుటూరులో జగన్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. వరద బాధితులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని జగన్ మరోసారి హామీ ఇచ్చారు.
500 కోట్ల నిధులతో....
సంక్షేమ పథకాలను అందరికీ దక్కేలా చూస్తామని చెప్పారు. ఒక్క ప్రొద్దుటూరులోనే ఈ ముప్ఫయి నెలల కాలంలో 320 కోట్ల నగదును లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు జగన్ చెపపారు. దీంతో పాటు ఐదు ప్రధాన మురికి కాల్వలను ఆధునికీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి పైపులైన్లు కూడా కొత్తవి వేస్తామని చెప్పారు. మంచినీటి సౌకర్యం కోసం 120 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story