Sun Dec 22 2024 18:45:07 GMT+0000 (Coordinated Universal Time)
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ అధికారులు కలిశారు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ అధికారులు కలిశారు. సీఎం జగన్ ను సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పండితుల వేద ఆశీర్వచనం అందించారు.
సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 17వ తేదీ ఆదివారం నాడు అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగనున్నాయి. 18 నాడు సోమవారం రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం-మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణం(మీన లగ్నం) – సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి. పెద్దశేష వాహనం – రాత్రి 9 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది.19వ తారీఖున మంగళవారం నాడు చిన్నశేష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు.. అలాగే స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. హంస వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయి. ఇక, 20వ తారీఖు బుధవారం రోజు సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. 21 తేది గురువారం నాడు కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు.. సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. 22తారీఖు శుక్రవారం నాడు మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. గరుడసేవ – రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.. శనివారం 23వ తారీఖు నాడు-హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు కొనసాగుతాయి. స్వర్ణరథం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.. గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనున్నాయి. ఇక 24వ తారీఖు – ఆదివారం రోజున – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.. చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. 25 తేది సోమవారం నాడు- రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు.. అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. 26తారీఖు మంగళవారం రోజు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 6 గంటల వరకు కొనసాగనున్నాయి. స్నపనతిరుమంజనం, చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు.. ధ్వజావరోహణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి.
Next Story