Sun Dec 22 2024 20:00:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ రెస్పాన్స్ చూశారా?
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలియజేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గడ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి, మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫలితాలపై స్పందించారు. ‘మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం భవిష్యత్తు ఫలితాలకు గొప్ప దిక్సూచిగా భావిస్తున్నాను. తెలంగాణ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులతోపాటు విజేతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. అని తెలిపారు. ఇక బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నానన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయిగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పోటీ జనసేన రాజకీయ నాయకత్వ నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుందని.. ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ఆవిర్భవించిందో లక్ష్య సాధనకు జనసేన కృషి చేస్తుందని అన్నారు.
Next Story