Sat Nov 23 2024 09:05:52 GMT+0000 (Coordinated Universal Time)
రుయా అంబులెన్సుల దందా పై స్పందించిన సీఎం జగన్
రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగతంపై..
తిరుపతిలోని రుయా ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగతంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సీఎం ను కలిసి ఘటన గురించి వివరించారు. ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ.. ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంఓను సస్పెండ్ చేసి, ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తాజాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం జగన్.. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి ఘటనలే మొత్తం వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తాయని జగన్ అన్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్ద దౌర్జన్యానికి పాల్పడిన ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Next Story