నీతిఅయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే..
అనంతరం సమావేశానుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను..
న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించే నోట్‌ను సమావేశ ప్రతినిధులకు సీఎం సమర్పించారు. అనంతరం సమావేశానుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలి.. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందని అన్నారు. భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉంది. లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యిందని అన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం అధికం ఖర్చు చేస్తోందన్నారు. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమన్నారు.